TS GOVERNMENT STARTS PROCESS TO FILL VACANCIES IN JUNIOR PANCHAYAT SECRETARY POSTS

Sharing is caring!

మళ్లీ పంచాయతీ కార్యదర్శుల భర్తీ

  • నియామకాల బాధ్యత కలెక్టర్లకు
  • గతంలో నిర్వహించిన రాత పరీక్ష ఆధారంగా భర్తీ

హైదరాబాద్‌ :- రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. గతంలో నిర్వహించిన రాత పరీక్ష ఆధారంగానే వీటిని భర్తీ చేయనున్నారు. ఈ నియామకాల బాధ్యతను నేరుగా కలెక్టర్లకే అప్పగించింది. గతంలో నిర్వహించిన కార్యదర్శుల పరీక్ష మెరిట్‌ లిస్ట్‌ను సంబంధిత జిల్లాలకు పంపాలని పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్‌ను బుధవారం ఆదేశించింది. ప్రభుత్వ ఒత్తిళ్లు, ఉద్యోగ భద్రత లేక అనేకమంది పంచాయతీ కార్యదర్శి పోస్టుల్లో చేరలేదని, చేరినా రాజీనామా చేస్తున్నారని ”మాకొద్దీ కొలువు” శీర్షికతో ఈనెల 26న ”ఆంధ్రజ్యోతి” కథనం ప్రచురించిన విషయం తెలిసిందే.
దీనిపై స్పందించిన ప్రభుత్వం.. ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి/జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి ఎవరో ఒకరు ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది.

స్థానికతకు సంబంధించి గతేడాది హైకోర్టు స్టే విధించిన పోస్టులు మినహా అన్నింటినీ భర్తీ చేయాలని కోరింది. రాష్ట్రవ్యాప్తంగా 9,355 మందిని జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులుగా ప్రభుత్వం ఎంపిక చేయగా 1300 మంది నియామక ఉత్తర్వులే తీసుకోలేదు. ఉద్యోగంలో చేరిన కొద్ది రోజుల వ్యవధిలోనే 356 మంది రాజీనామా చేయగా, కొందరు సెలవుల్లో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2,100 కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

#SOURCE :- ఆంధ్రజ్యోతి

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *